06/06/2020
కోవిడ్-19 ఆట ఇప్పుడే మొదలైంది!
కరోనా విశ్వరూపం చూపిస్తుంది.
◆ మొదటి కేస్ నుండి లక్ష కేసులు అవటానికి 110 రోజులు పట్టింది,
◆ ఒక లక్ష నుండి రెండు లక్షలు చేరటానికి 15 రోజులు పట్టింది,.
◆ రాబోయే కాలం లో ఒక వారం లోనే డబల్ కేసులు రెట్టింపు అవుతాయి.
◆ ముంబై లో పరిస్థితి దారుణం గా ఉంది.
◆ ఒకే బెడ్ మీద ఇద్దరు కోవిడ్ పేషెంట్లు, రెండు బెడ్స్ మధ్యలో ఉన్న కాళీల్లో కూడా పేషెంట్స్, వెంటిలేటర్స్ చాలని పరిస్థితి.
◆ వైద్యం అందక కొందరు చనిపోతున్నారు.
◆ మనం కూడా ఆ స్టేజి లోకి వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
◆ హైదరాబాద్ లో ఉస్మానియాలో 25 డాక్టర్లు, నిమ్స్ లో 5గురు గుండె డాక్టర్లు, 5 గురు హెల్త్ వర్కర్స్ ఇన్ఫెక్టు అయ్యారు.
◆ 25 మంది డాక్టర్లు హాస్టల్ వాళ్ళు అవటం వల్ల, సుమారు 600 మంది డాక్టర్లను క్వారంటీన్ కి పంపించారు.
◆ 600 మంది డాక్టర్లు ఒక్కసారిగా పని మానేస్తే , పేషెంట్స్ ఇబ్బందులు చెప్పనక్కర్లేదు..
◆ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోక, ప్రైవేట్ హాస్పిటల్స్ రంగం లోకి దిగుతాయి,
కనీసం రూ. 7 లక్షలు తగ్గకుండా బిల్ అవుతుంది,
◆ ఇదే విధం గా డాక్టర్లు కూడా ఇన్ ఫెక్ట్ అయి క్వారంటీన్ కి వెళ్తే, కొన్ని రోజుల్లోనే ఆరోగ్య శాఖ చేతులెతోస్తుంది,
◆ డబ్బు ఉన్నా వైద్యులు ఉండరు, వైద్యులు ఉన్నా వెంటిలేటిర్స్ ఉండవు,
◆ రాబోయే రోజుల్లో కేసులు విపరీతంగా పెరుగుతాయి,
60 ఏళ్ళు దాటినా వాళ్ళు, లంగ్స్,గుండె జబ్బులు ఉన్నవాళ్లు, సాధ్యమనంత జాగ్రత్త గా ఉండండి, అత్యవసరం అయితే తప్ప భయటకు రావొద్దు, మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించండి. భౌతిక దూరం మరవద్దు,
◆ అనవసరం గా గుంపులు గా తిరగొద్దు, మంచి ఆహారం, కొద్ధి పాటి వ్యాయామం అవసరం.
◆ రాబోయి కాలం లో మనం కోవిడ్ అసలు రూపం చూడబోతున్నామని తెలుసుకోండి.. దీనికి స్వీయ రక్షనే విరుగుడు..