10/06/2026
Carrot Fry 🥕
Ingredients:
• క్యారెట్ – పావు కిలో (తురుముకున్నది)
• పచ్చిమిర్చి – 3
• కరివేపాకు – 3 రెమ్మలు
• శనగపప్పు – 1 చెంచా
• మినప్పప్పు – 1 చెంచా
• ఆవాలు – అర చెంచా
• జీలకర్ర – అర చెంచా
• ఎండుమిర్చి – 2
• నూనె – 2 చెంచాలు
• ఉప్పు – రుచికి సరిపడా
• పసుపు – కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా క్యారెట్‌ను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురుముకోవాలి.
బాండీలో 2 చెంచాల నూనె వేసి వేడెక్కాక 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, అర చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
తర్వాత 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి.
కొద్దిసేపటి తర్వాత కొద్దిగా పసుపు వేసి మళ్లీ కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. క్యారెట్ చాలా త్వరగా మెత్తబడుతుంది.
క్యారెట్ పూర్తిగా మగ్గి మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్య�