30/01/2024
karimnagar story
# # # # # # # # # # # # # #
ఎప్పుడో నిజాం నవాబు లు నిర్మించిన మానేరు వంతెన దాటి రాగానే కరీంనగర్ స్వాగత ద్వారం 1936 లో మీర్ ఉస్మాన్ అలీ గారు నిర్మించి మీర్ ఉస్మాన్ అలీ గారు కరీంనగర్ రాక సందర్భంగా వారి చేతనే ప్రారంభించ బడి కరీంనగర్ కే వన్నె తెచ్చింది,నిజాం పాలన 25 సం!!పూర్తయిన సందర్భంగా దీనికి జూబ్లీ కమాన్ అని పేరు పెట్టారు ,కానీ ఇప్పటికి ఆ పేరు తెలియని వారెందరో,వొకప్పుడు పాత బజార్ ( శివాలయం ప్రాంతం) ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఉన్న కరీంనగర్,1928 సం!!లో బ్రిటిష్ కలెక్టర్ "హంటర్"దొరగారు నిర్మించిన క్లాక్ టవర్ ఇప్పుడు ముఖ్య వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది, 1952 లొ మున్సిపల్ ఏర్పడి మొదటి మున్సిపల్ చెయిర్మెన్ గా బషీరోద్దిన్ గారు ( ఖాజీ సాబ్ గా సుపరిచితులు) నియమితులయినారు. వన్ టౌన్ అంటే ఇప్పటి రూరల్ పొలీసు స్షేషన్ ముందు ధర్మక్క బడి ,భారత్ టాకీస్ దగ్గర సారమ్మ బడి,శీనయ్య సారు బడి,కుంటి సారు బడి బాల్య విద్య కొరకై ,ప్రాథమిక విద్య కొరకై కుమార్ వాడి,గంజ్ హై స్కూల్, మల్టీ పర్పస్ హై స్కూల్,ధన్గర్వాడీ,బాలికలకై బాలికల పాఠశాల ,ప్రైవేట్ పరంగా సరస్వతి శిశు మందిర్,St John's, వాణిణీకేతన్, ఇవ్వే అప్పటి విద్యాలయాలు,ఇంటర్ విద్య కోసం రెండు జూనియర్ కళాశాలలు వొకటి ఆర్టఉవఇంగ్ ఇంకొటి సైన్సువింగు ,ఉన్నత విద్య కై 1956 లోని ప్రైవేట్ పరంగా మొదలయి 1959 లోన మన ప్రభుత్వం మేనేజ్ మెంట్ తీసుకొని S.R.R college,తరువాత 1978 లో శాతవాహన పి.జీ.కాలేజి ప్రారంభింప బడినవి మన ప్రాంతం వారి ఉన్నత చదువులకై.
మన సాగు ,త్రాగు నీటి అవసరాలు నీటి నిలువకై 1985 లో లోయర్ మానేరు డాం ప్రారంభింపబడినది. పాడి రైతులు ప్రజల అవసరాలు నిమిత్తం కరీంనగర్ డైరీ నుండి 1971 లోని ప్రారంబించారు,
వైద్య అవసరాలకు సివిల్ హాస్పిటల్ 1952 లోన ప్రారంబించిన మిషన్ హాస్పిటల్ ఉన్న కూడా ప్రైవేట్ పరంగా డా.కోషీ ,వెంకట రమణారావు గారు డా.నాగభూషనం గారు ,పటేల్ గారు, ఆదినారాయణ గారు ,నర్సింహ రెడ్డి గారు ,కొంచెం ముందుకొస్తే బాలిరెడ్డి ,డా.జగన్నాథ రెడ్డి గారు ,డా.మాడేకరు గారు ,డా.భూంరెడ్డి గారు కరీంనగర్ వారికి అందుభాటు లో ఉండేవారు. ఇపుడు వొక వేయి పైగా ప్రైవేటు హస్పిటల్సు. న్యాయ పరమైన అవసరాలకు న్యాయస్థానం కరీంనగర్లో 1956 వ సం!! లోన ప్రారంబించారు ఇక్కడా విషేషం ఎమంటే కరీంనగర్ చెరసాల అప్పటి పాలకులు చే 1857 లో ప్రారంబించబడిందీ,రవాణా సౌకర్యం నకు వస్తే వొకే వొక్క బొగ్గు బస్ ఉ. 5.00 బయలు దేరి రాత్రి 7.00 గం లకు చేరుకునేది , దగ్గర ప్రయాణాలకి స్వారీ కఛ్రాలు,ప్రైవేట్ బస్ సర్వీసులు తప్ప ఏమి వుండక పోయేది,ప్రజల రవాణా అవసరాలు ద్రృష్ట్యా 1976 నవంబర్ 11 నా ఇప్పటి కొత్త బస్ స్టాండు ఏర్పడినది,ఇప్పటికి ఇంతే తిరిగి కలుద్దాం మల్లీ వొక సారి.
I ❤️ my city - my karimnagar.