11/05/2026
మెదక్ డీఆర్వోగా అంబదాస్ రాజేశ్వర్ బాధ్యతలు
మెదక్ జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) జి. అంబదాస్ రాజేశ్వర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఆయన, బదిలీపై వెళ్ళి తిరిగి సివిల్ సప్లై శాఖ నుండి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.