Gani4u

Gani4u Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gani4u, Home improvement, 210, Surat.

28/04/2016

అద్భుతమైన నీతి కథ. ..!!

ఒక అడవి లో ఒక లేడి 🐺భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి....దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది 🌊☄☄ ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది🐺 .....అప్పుడే దట్టమైన మబ్బులు☁☁ కమ్మాయి . ఉరుములు , పిడుగులు ⚡💥. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది🔥🔥🔥 . దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం 🦁వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు👺 బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...!
🔴భగవాన్ ! ఆ లేడి 🐺ఇప్పుడు ఏమి చెయ్యాలి ?.
🔴ఏమి జరగబోతోంది ?
🔴లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? 🔴బిడ్డ బతుకుతుందా?
🔴 సింహం🦁 లేడిని తినేస్తుందా ?
🔴వేటగాడు👺 లేడిని చంపెస్తాడా ?
🔴నిప్పు 🔥లేడి 🐺వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?
ఒక వైపు నిప్పు 🔥,
రెండో వైపు నది🌊 , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు👺🦁 , సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.
అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..... అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి.......పిడుగు కాంతికి వేటగాడి👺 కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి🦁 తగిలింది. వర్షం⛈🌧 పడి సమీపిస్తున్న మంటలు 🔥🔥 ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.......ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ..... ఏమి జరిగేది????....మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము . మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము .భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది.

12/01/2016
13/05/2015

: తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతోన్న 11 నెలల పసికూనను తొమ్మిదేళ్ల బాలుడికి ఇచ్చి పెళ్లిచేశారు. అనుకున్న మాట ప్రకారం అబ్బాయి కుటుంబానికి లాంచనాలు ముట్టజెప్పారు. చిన్నారికి ఈడొచ్చాక కాపురానికి పంపించాలని తీర్మానించుకున్నారు. ఆ తరువాత ఆ పాపాయి కుటుంబం ఉపాధి కోసం పల్లె నుంచి పట్నానికి మకాం మార్చింది. కాలం గిర్రున తిరిగింది. ఆ 11 నెలల చిన్నారికి ప్రస్తుతం 19 ఏళ్లు. పేరు శాంతా దేవి మేఘావాల్. జోధ్పూర్లోని జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

కాపురానికి రావాలంటూ ఈ మధ్యే ఆమె అత్తగారి ఇంటినుంచి కబురొచ్చింది. అభం శుభం తెలియని వయసులో జరిగిన పెళ్లి తనకు ఇష్టం లేదని, కాపురానికి వెళ్లే ప్రసక్తేలేదని శాంతాదేవి తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అందుకు సరేనన్నఆమె తల్లిదండ్రులు.. సదరు వరుడి బంధువులకు ఇదే విషయం చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన వరుడి తల్లిదండ్రులు కుల పంచాయతీ పెట్టించారు. శాంతాదేవి కాపురానికి రావాల్సిందేనని గ్రామపెద్దలు బెదిరించారు. రానిపక్షంతో రూ. 16 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు.

దీంతో బెదిరిపోయిన శాంతాదేవి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం జోధ్పూర్లో ప్రెస్మీట్ నిర్వహించి తన గోడును మీడియాకు వెల్లడించింది. బాగా చదుకొని టీచర్ కావాలనుందని, తన బాల్య వివాహం రద్దయ్యేందుకు సహకరించాలని కోరింది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా స్సందించారు. పోలీసులకు ఫిర్యాదు sచేయాల్సిందిగా బాధితురాలికి సూచించారు.

Address

210
Surat
395002

Website

Alerts

Be the first to know and let us send you an email when Gani4u posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share